రాజకీయ వార్తలు – Political News
Trending
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి 2024
మైక్రో ఆర్ఎన్ఏ పరిశోధనకు గాను అమెరికా శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి
ప్రఖ్యాత నోబెల్ బహుమతుల 2024 ప్రకటన సోమవారం నుండి ప్రారంభమైంది. నేడు వైద్యశాస్త్రంలో చేసిన అసాధారణ పరిశోధనకు గాను ఇద్దరు అమెరికన్ డాక్టర్లు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కూన్ నోబెల్ బహుమతిని అందుకున్నారు.
జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక అంశమైన మైక్రో ఆర్ఎన్ఏ మరియు పోస్ట్ ట్రాన్స్ స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ పై ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు చేసిన విశేష పరిశోధనల కారణంగా వీరికి స్వీడన్ నోబెల్ బృందం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు వైద్యశాస్త్రంలో 227 మందికి నోబెల్ బహుమతి లభించింది. బహుమతుల ప్రదానోత్సవం డిసెంబర్ 10, ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజు నిర్వహించబడుతుంది.